శేరిలింగంపల్లి, నవంబర్ 1: ఒడిశా నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు మహింద్రా ఎక్స్‌యూవీ కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలు వెల్లడించారు.
హర్యాన రాష్ట్రం, దివానీ జిల్లాకు చెందిన చమన్, రాకేశ్, నగరంలోని బోయిన్‌పల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్ అలియాస్ చిన్ను, అర్జున సా యికృష్ణలు ముఠాగా ఏర్పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కారులో గంజాయిని ఒడిశా నుంచి నగరానికి తీసుకువస్తున్నారు. దీనిసై సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ, చందానగర్ పోలీసులు శనివారం రాత్రి గంగా రం హనుమాన్ దేవాలయం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. మహీంద్రా ఎక్స్యువీ 300 (టీఎస్225068) కారు రాగా దానిని ఆపి తనిఖీ ని ర్వహించగా.. కారు డోర్లలో ఉన్న రూ.18 లక్షల విలువచేసే 57 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నారు.
కారులో ఉన్న చమన్, ఉమాకాంత్‌తో పాటు ద్విచక్రవాహనంపై పైలట్‌గా వస్తున్న సాయికృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి హర్యానకు చెందిన రాకేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 57 కిలోల గంజాయితోపాటు కారు, పల్సర్ బైక్ (టీజీ10 ఏటీఆర్ 8636), మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం రెడ్డి, మియాపూర్, మాదాపూర్ ఎసీపీలు నర్సింహారావు, శ్రీకాం త్, చందానగర్ సీఐ పాలవెల్లి పాల్గొన్నారు.