Hyderabad | హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడలో గంజాయి మత్తులో ఓ బ్యాచ్ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న చంద్రయాన్‌గుట్ట పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. గంజాయి బ్యాచ్‌ను అదుపు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏఎస్సై చొక్కా పట్టుకుని గంజాయి బ్యాచ్ దాడికి దిగారు. నన్ను ఏమీ చేయలేరంటూ.. ఏఎస్సై చేతిలోనే ట్యాబ్‌ను తీసుకుని పగులగొట్టారు.
దాదాపు అరగంట పాటు గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. చివరకు పోలీసులు వారిని కట్టడి చేశారు. మత్తులో ఉన్న ఇద్దరి అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి.