HYDRAA | హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు.. ఓ మహిళ ఆవేదన ఇదీ..
HYDRAA | హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
HYDRAA | హైదరాబాద్ : హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
ఈ సందర్భంగా బాధిత మహిళలు బోరున విలపించారు. కుక్కల మాదిరి రోడ్డున పడ్డామని కన్నీరు పెట్టుకున్నారు. హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు అని శాపనార్థాలు పెట్టారు. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.. ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసెను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పండుగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ మొగోళ్ళను పంపడం కాదు.. రేవంత్ రెడ్డి వచ్చి మాతో మాట్లాడాలి. ఓట్లు వేయించుకుని గెలిచి ఇండ్ల కూర్చోవడం కాదు. దమ్ముంటే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావాలి. పోలీసోళ్లతోన బతుకమ్మ ఆడుతున్నాం.. పోలీసోళ్లు లాఠీలతో కొట్టి బతుకమ్మ ఆడిస్తున్నారు అని మహిళలు పేర్కొన్నారు.
పండుగ పూట మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. చిన్న గుడిసె వేసుకొని బ్రతుకుతుంటే దాన్ని కూడా కూల్చేశారు. పండుగ పూట మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తలేరు. రేవంత్ రెడ్డి మా దగ్గరికి వస్తే రాళ్లు తీసుకొని కొడతామని గాజులరామారం హైడ్రా బాదితుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా మీద మన్నువడ.. మమ్మల్ని సంపుతున్నరు
మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.. ఆ ఇల్లు లేదు, ఉన్న రేకుల గుడిసెను కూడా కూల్చేశారు https://t.co/tmoFtqSnkV pic.twitter.com/AbuKnK1auh
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

