Hyderabad | హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపింది.
సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమైన తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు, నగరంలో మంగళవారం రాత్రి ఉచిత రవాణా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
TGDEECET | జనవరి 2 నుంచి డీఎడ్ రెండో విడుత కౌన్సెలింగ్
Osmania University | ఓయూ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షల తేదీల ఖరారు
Bhadrachalam | 31 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం