TGDEECET | హైదరాబాద్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడుత షెడ్యూల్ విడుదలయ్యింది. 2025 జనవరి 2 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కన్వీనర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి 4 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, జనవరి 9న సీట్లను కేటాయిస్తామన్నారు. సీట్లు పొందిన వారు జనవరి 9 నుంచి 13 వరకు ఫీజు చెల్లించాలి. 16న రిపోర్ట్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షల తేదీల ఖరారు
Bhadrachalam | 31 నుంచి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం
Telangana | రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ