Hyderabad | బన్సీలాల్ పేట్, ఫిబ్రవరి 8 : జనహిత సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని మేనేజింగ్ ట్రస్టీ ఎస్ నర్సింహ మూర్తి తెలిపారు. బన్సీలాల్‌పేట్ డివిజన్లోని భొలక్పూర్లోని శిక్షణా కేంద్రంలో గృహోపకరణాలైన ఏసీ, ఎయిర్ కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, గీజర్ల రిపేరింగ్ గురించి 10 రోజుల ఉచిత శిక్షణకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు హాజరు కావాలని ఆయన కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్లను అందజేస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు ఎం. శ్రీనివాస్ సెల్ నెంబర్ 8106887523లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
NAAC | నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న న్యాక్.. కోర్సుల వివరాలివే..!
Hyderabad | ఠాగూర్ ఆస్పత్రి సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని బాధితుల ఆందోళన!
మెదక్ నుంచి మీర్జాపల్లి వరకు రైల్వే లైన్ పొడిగించండి.. రైల్వే మంత్రికి మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్