కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 5: గంజాయి తాగుతున్న నలుగురు యువకులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ ఏడో ఫేజ్‌లోని గెలాక్సీ వైన్స్ షాపు వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు గంజాయి తాగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన వారు.. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిని తాళ్లూరి హర్షిత్ సూర్య సాయి, అన్నం రెడ్డి శంకర్, దొడ్డ ప్రశాంత్, బొడ్డు సాయి మణిరామ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు గ్రాముల గంజాయి, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.