ఉప్పల్ నవంబర్ 23 : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు నాచారం పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…న్యూభవానీనగర్‌కు చెందిన సునిల్కుమార్సింగ్ కుమారుడు అభిషేక్ కుమార్‌సింగ్(23), బోడుప్పల్‌కు చెందిన స్నేహితుడు సచిన్‌తో కలిసి సూర్యనగర్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ (టీఎస్08 జే34469)పై వెళ్తున్నారు. మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద స్కూటీ (టీజీ07ఏహెచ్5520)పక్కన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అతి వేగంగా దూసుకువచ్చిన వీరి బైక్ స్కూటీని ఢీకొట్టడంలో అభిషేక్ కుమా ర్సింగ్ ఎగిరిపడి నీటి పైపులైను ఇనుప కంచెపై పడగా తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సచిన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీ వద్ద ఉన్న ఇద్దరు వ్యక్తులు సైతం గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న చర్లపల్లికి చెందిన చిక్కుడు అశోక్, అనిత (32) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి అనిత సోదరి ఇంటికి భార్య పిల్లలతో అశోక్ ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. నాచారం హెచ్ఎంటీనగర్ కమాన్వద్దకు వెళ్లగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అనిత తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్, నవంబర్ 23 : రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మొట్రో స్టేషన్ సమీపంలోని పిల్లర్ నంబర్ 1618 వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోహన్‌నగర్ టెలిఫోన్ కాలనీకి చెందిన గుళ్ల మధు (32), రామకృష్ణ హరీశ్ (32)లు స్నేహితులు. ఈ ఇద్దరు శనివారం రాత్రి బైక్‌పై అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సరూర్‌నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్డం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.