మేడ్చల్, జనవరి5 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల గందరగోళంగా మారిందని, విలీన పక్రియతో ప్రజలంతా అయోమయంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వార్డుల విభజన, గ్రామీణా ప్రాంతాన్ని పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేస్తున్నారన్నారు.
మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వార్డుల విభజనపై ప్రతి రోజు అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో రైతులు సాగు చేసున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలను విలీనంపై తమకు పన్నుల భారం పడుతుందని ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు.