హైదరాబాద్ : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని(Khairatabad) సప్తముఖ మహాశక్తి గణపతిని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. కాగా, 70 అడుగులతో రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ వినాయకుడిని(Maha Ganapati) దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
గణనాథుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలానే ప్రముఖులు సైతం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. pic.twitter.com/sLp1XnVDg4
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!