కందుకూరు. జనవరి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. హమీలను విస్మరిస్తే ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని ఆమె పేర్కొన్నారు. శనివారం కందుకూరు మండల పరిషత్ సమావేశపు హలులో 180మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. కందుకూరు వరకు మెట్రో, మెడికల్ కళాశాల, ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం సంతోషకరమని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి. వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి దశరథ ముదిరాజ్, మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మేఘనాథ్‌రెడ్డి, యూత్ నాయకులు కార్తీక్, బొక్క దీక్షిత్‌రెడ్డి, చిర్ర సాయిలు, గుయ్యని సామయ్య, డైరెక్టరు పొట్టి ఆనంద్, కాసోజు ప్రశాంత్‌చారి, గొర్రెంకల రామకృష్ణా, ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.