మేడ్చల్జోన్బృందం,జనవరి4: ప్రజాపాలన భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో తరలివచ్చి, దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో యథావిధిగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. పలుచోట్ల కౌన్సిలర్లు, నాయకులు దరఖాస్తులను స్వీకరించారు. మేడ్చల్ మండలంలోని సోమారం, శ్రీరంగవరం గ్రామాలు, సైదోనిగడ్డ తండాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీడీవో పద్మావతి, తహసీల్దార్ శైలజ పర్యవేక్షణలో నిర్వహించారు. శ్రీరంగవరంలో దరఖాస్తుల స్వీకరణను జడ్పీటీసీ శైలజా విజయనంద రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు విజయనందరెడ్డి, సుజాత కిషన్ నాయక్, కవితఆంజనేయులు ఏవో అర్చన, ఎంఈవో వసంత పాల్గొన్నారు.
అదే విధం గాగుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కమిషనర్ రాములు పర్యవేక్షణలో ప్రజాపాలన నిర్వహించారు. ఘట్కేసర్ మండల పరిధి చౌదరిగూడలో దరఖాస్తుల స్వీకరణలో మేడ్చల్ బీబ్లాక్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ కార్యదర్శి అమరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్, నాయకులు పాల్గొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రజాపాలన కేంద్రాలను కమిషనర్ రామలింగం అధికారులతో కలిసి సందర్శించారు.డీఈఈ మాధవచారి, కార్పొరేటర్లు, మున్సిపల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.తూంకుంట మున్సిపాలిటీలోని 16వార్డుల్లో, మూడుచింతలపల్లి మండలంలోని మూడుచింతలపల్లి, లింగాపూర్ తండా, ఉద్దెమర్రి గ్రామా ల్లో ఎంపీడీవో వత్సలాదేవి, తహసీల్దార్ వాణిరెడ్డిల ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది దరఖాస్తులు స్వీకరించారు.శామీర్పేట, మూడుచింతలపల్లి మండలంలోని గ్రామాల్లో, మండల కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.పోచారం చైర్మన్ బి.కొండల్ రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్నారు.