రవీంద్రభారతి: మృగశిర కార్తి సందర్భంగా జూన్ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి జన్సేవా సంఘ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు బిస్వాజిత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ చౌదరితో కలిసి ఆయన మాట్లాడారు. చేప మందు ప్రసాదం కార్యక్రమంలో రోగులకు కిచిడి, పండ్లు, శుద్ధిచేసిన తాగునీరు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుశీల్ శ్రీవాస్తవ్, సీతారం ఠాకూర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.