త్యం అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండామార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మార్కెట్రోడ్డులోని ఇస్లామియా స్కూల్ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణం నుంచి దట్టమైన పొగలు బయటకు వచ్చాయి. అనంతరం కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి.
వీటిని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
– బేగంపేట, డిసెంబర్ 19