Rangareddy | రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థుల ఇండ్ల వద్ద నుంచి దించి వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో మంటలు వ్యాపించాయి. పొగలు రావడంతో వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్ దిగిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరూ బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు.