Hyderabad | హైదరాబాద్ : చార్మినార్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూర్గిచౌక్ వద్ద ఉన్న ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనున్న మరో షాపుకు మంటలు వ్యాపించాయి. ఆప్టికల్, మిఠాయి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణాల యజమానులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.