శంషాబాద్ రూరల్, మార్చి 16: శంషాబాద్ ఎయిర్పోర్టు లో 42లక్షల విలువైన డ్రోన్లను తీసుకువస్తున్న ముగ్గురు ప్రయాణికులను ఎయిర్పోర్టులో ఆరెస్టు చేశారు. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన మహ్మద్, తాజ్, అస్గర్ ముగ్గురు కలిసి సింగాపూర్కు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ముగ్గురు వేర్వేరు విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారిపై అనుమానం ఇచ్చిన అధికారులు వారి సామగ్రిని తనిఖీలు చేయగా వారి వద్ద 42లక్షల విలువైన 74 డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.