Fire Breaks | హైదరాబాద్ : నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.