మాదాపూర్: హైదరాబాద్లో మాదాపూర్లోని (Madhapur) అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు క్యామెల్క్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.