హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరుగలేదని తెలిపారు.