GHMC | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో గురువారం సాయంత్రం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో, తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన విలువైన సమాచారం కాలి బూడిదైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.