హైదరాబాద్ : నగరంలోని కోఠి మెడికల్ కాలేజీ బస్‌స్టాప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫూట్ వేర్ షాప్ , బట్టల దుకాణం దగ్దమయ్యాయి. బస్ స్టాప్‌కు ఆనుకోని ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.