Fire Accident | హైదరాబాద్ : మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూడూరు గ్రామంలోని సీసీఐ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పత్తి గోదాం కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. గోదాం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాం కుప్పకూలింది. మంటలను గమనించి సిబ్బంది బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణ నష్టం తప్పింది. రూ. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ACB | రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ ఆస్తులు రూ. 17.73 కోట్ల పైనే..