Congress vs MIM | హైదరాబాద్ : నాంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పైకి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన అనుచరులు దూసుకెళ్లారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం నాంపల్లి నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నాంపల్లిలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి
ఫిరోజ్ ఖాన్‌పై కర్రలతో దాడి చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వర్గం pic.twitter.com/XJS7LiS5bL
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024
ఇవి కూడా చదవండి..
MLA KP | పాలనను గాలికొదిలి ఢిల్లీ చక్కర్లు కొడుతున్న సీఎం : ఎమ్మెల్యే కేపీ
KTR | పనిమంతుడని పందిరేపిస్తే.. పిల్లి తోక తగిలి కూలిందట.. రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
ANMs Dharna | ఎనిమిది నెలలుగా జీతాల్లేవ్.. ఐటీడీఏ ఎదుట ఏఎన్ఎంల ధర్నా