సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసిన 12 మంది ఉద్యోగులకు ఉద్యోగ వయోపరిమితి పూర్తయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వారికి వీడ్కోలు సభను నిర్వహించి ఘనంగా సన్మానించారు. అదనపు కమిషనర్ (అడ్మిన్) నళిని పద్మావతి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి తమ సేవలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు.