Electricity Demand | సిటీబ్యూరో: గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏటా వేసవిలో డిమాండు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మే నెలలో నమోదయ్యే రికార్డులు ఈసారి ఏప్రిల్‌లోనే నమోదయ్యాయి.
గతేడాది(2023) ఏప్రిల్‌తో పోల్చిచే ఈ ఏడాది (2024) ఏప్రిల్‌లో ఒకేసారి 38.89 శాతం విద్యుత్ వినియోగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగింది. అదే సమయంలో గరిష్ఠ డిమాండు అత్యధికంగా 4241 మెగావాట్లు నమోదు కాగా, వృద్ధిరేటు 35.91 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నెల రికార్డు నెలకొల్పగా, మేలో సైతం ఇదే విధమైన డిమాండు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెలలో వినియోగం 95-100 మిలియన్లకు చేరే అవకాశం ఉందంటున్నారు.