జూబ్లీహిల్స్, నవంబర్7: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ డే (నవంబర్ 11) రోజున దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనున్నారు. ఉచిత రవాణా కావాలనుకునేవారు సక్షం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అందులో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లను వాహనాలలో తరలించి చక్రాల కుర్చీలలో సహాయకులతో పోలింగ్ కేంద్రానికి చేర్చనున్నారు. దృష్టిలోపం ఉన్నవారికి పోలింగ్ బూత్‌లోకి ఒక సహాయకుడిని సైతం అనుమతించనున్నారు. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సంబంధిత ఓటర్ల నోడల్ ఆఫీసర్, యూసీడీ అదనపు కమిషనర్ వార్డులవారీగా కమ్యునిటీ ఆర్గనైజర్ల నియామకం చేపట్టారు. సక్షం యాప్‌లో ముందుగా నమోదుచేసుకున్న వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలతో పాటు సంబంధిత అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.
యూసుఫ్‌గూడ డివిజన్‌కు ఎన్.కిషోర్ కుమార్- 9966456202, కే మురళి- 8008494467.. వెంగళరావునగర్ డివిజన్‌కు జి.ఇందిర-9949137772, ఎన్ నర్సింహ-99899998176, షేక్‌పేట్ డివిజన్‌కు.. కే కృష్ణయ్య-8686413049, రహ్మత్‌నగర్ డివిజన్‌కు ఎం మహిపాల్‌రెడ్డి-9959447333, ఎస్ సుజాత- 9949039352, ఎర్రగడ్డ డివిజన్‌కు పి ముస్తాఫా-8341324881, వీఆర్కే పాపాగౌడ-9182499400, బోరబండ డివిజన్‌కు..ఎం దయాకర్ రావు-9550699964, ఎం యాదయ్య-9000943222ను నియమించారు. ఉచిత రవాణా కోసం నమోదు చేసుకోవాలనుకునే ఓటర్లు మరిన్ని వివరాలకు పై నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీసీ జీ రజినీకాంత్ రెడ్డి తెలిపారు.