హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న యువతి గాయపడింది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో బతికి బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కారులోని డ్రైవింగ్ సీటులో ఇరుక్కున్న ఆమెను అద్దాలు పగులగొట్టి బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. యువతి మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.