వెంగళరావునగర్, ఫిబ్రవరి 2:మద్యం మైకం తలకెత్తిన ఓ మందుబాబు విచక్షణ మరచి విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్( Constable) పై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం..మధురానగర్ కు చెందిన ఓంసింగ్(23) మద్యం మత్తులో తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. దాంతో అతని తండ్రి సంజయ్ సింగ్ డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మధురానగర్ గస్తీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
గొడవ చేస్తున్న ఓంసింగ్ ను కానిస్టేబుల్ సవీన్ గౌడ్ తన ట్యాబ్ లో వీడియో చిత్రీకరించసాగారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓం సింగ్ ఆవేశానికి లోనై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నవీన్ గౌడ్ వద్ద ఉన్న ట్యాబ్ ను లాక్కుని విసిరేశాడు. కానిస్టేబుల్ నవీన్ గౌడ్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కంటి వద్ద గాయమైంది. నిందితుడు ఓంసింగ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి..