HUL M-Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30లో టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,83,322.54 కోట్లు పెరిగింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1315.5 పాయింట్లు (1.72 శాతం) లబ్ధి పొందితే, ఎన్ఎస్ఈ-50 సూచీ 389.95 పాయింట్లు (1.68 శాతం) లాభ పడ్డాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో శనివారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లబ్ధి పొందాయి. మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,471.36 కోట్లు పెరిగి రూ.5,89,066.03 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.32,302.56 కోట్లు వృద్ధి చెంది రూ.8,86,247.75 కోట్ల వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.30,822.71 కోట్లు పుంజుకుని రూ.12,92,450.60 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.26,212.04 కోట్లు పెరిగి రూ.5,78,604.05 కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.25,373.2 కోట్లు పెరిగి రూ.17,11,371.54 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,411.05 కోట్లు పెరిగి రూ.6,83,715.14 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.16,729.62 కోట్లు పుంజుకుని రూ.5,36,201.68 కోట్లకు చేరుకుంది.
మరోవైపు, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,058.27 కోట్లు పతనమై రూ.14,73,918.40 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.11,211.96 కోట్లు నష్టపోయి రూ.9,25,201.9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,653 కోట్లు కోల్పోయి రూ.7,68,959.76 కోట్ల వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.