బండ్లగూడ, ఏప్రిల్ 28 : కార్లు ఢీ కొన్న ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న మరొ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడిగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫై ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బోల్తా కొట్టిన కారును అక్కడి నుంచి తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sobhita Dhulipala | అక్కినేని కోడలిని అంత మాట అనేశారేంటి.. సమంతని రెచ్చగొడుతుందా?
BBC | పెహల్గామ్ ఉగ్రదాడి కవరేజీపై ఆగ్రహం.. బీబీసీ ఇండియా హెడ్‌కి కేంద్రం లేఖ
Shruti Haasan | నేను కొందరిని బాధపెట్టాను.. శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!