Sobhita Dhulipala |అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య తొలుత సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారు బాగానే ఉన్నా ఊహించని విధంగా విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు. ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాళ్లని వివాహం చేసుకున్నాడు చైతూ. పెళ్లైనప్పటి నుండి ఈ జంట సరదాగా షికార్లు కొడుతూ వైవాహిక జీవితాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారి ఎంజాయ్మెంట్కి సంబంధించిన ఫొటోలని కూడా అడపాదడపా షేర్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం సరదాగా గడిపిన క్షణాలని నాగ చైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పిక్స్‌లో సమంతకి ఇష్టమైన హ్యాష్ డాగ్‌తో పాటు శోభిత కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. సమంతని టార్చర్ చేయాలనే చైతూ ఈ ఫోటోస్ షేర్ చేశాడని, శోభిత కూడా హ్యాష్‌తో అందుకే ఫొటో దిగిందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సమంత ఎంతో ఇష్టపడి ఈ పెట్ డాగ్ తెచ్చుకుంది సమంత. చైతూ- సమంత భార్య భర్తలుగా ఉన్న సమయంలో ఈ పెట్ డాగ్‌తో వారిద్దరు సరదాగా గడిపారు. అలానే పలు ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే ఇప్పుడు సమంత స్థానంలో శోభిత కనిపించడంతో సామ్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
శోభిత పోజు చాలా అసహ్యంగా ఉందని కొందరు, ఒంటరిగా ఉన్న సమంతను ప్రశాంతంగా ఉండనివ్వకూడదనే ఇలా చేస్తున్నారా అని ఇంకొందరు ఫొటోలకి కామెంట్స్ పెడుతున్నారు. ఇక శోభిత కూడా తన ఇన్‌స్టాలో పలు పిక్స్ షేర్ చేసింది. డల్‌గా ఉన్న ఫొటోలు కొన్ని, గిబ్లి ఇమేజ్ ఒకటి, తన యాడ్‌కి సంబంధించినది ఒకటి, చైతూతో కలిసి దిగిన పిక్ ఒకటి ఇలా పలు పిక్స్ షేర్ చేసింది. కాగా, అక్కినేని నాగ చైతన్యను శోభిత దూళిపాళ్ల ప్రేమించి పెళ్లి చేసుకుంది. చైతూకి ఇది రెండో పెళ్లి కాగా, శోభితకు ఫస్ట్ మ్యారేజ్. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య.. మళ్లీ ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో శోభితను పెళ్లి చేసుకున్నారు.