Shruti Haasan | శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరియర్ తొలినాళ్లలో వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడ్డా.. ఆ తర్వాత వరుస హిట్లతో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. అయితే, శ్రుతి సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, లవ్ ఎఫైర్స్, బ్రేక్‌లతో వార్తల్లో నిలుస్తుంది. ప్రేమ వ్యవహారాలు, బ్రేక్‌లపై సైతం ఎలాంటి దాపరికం లేకుండానే స్పందిస్తూ వస్తుంది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత సంబంధాలతో పాటు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు చేర్చుకున్నానని వ్యాఖ్యానించింది.
ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన గత సంబంధాలు, వాటి వల్ల నేర్చుకున్న పాఠాలు, పశ్చాత్తాపంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతమంది చాలా విలువైన వ్యక్తులను బాధపెట్టానని.. అలా చేసి ఉండాల్సి కాదని అనిపిస్తుందని చెప్పింది. దానిపై ప్రస్తుతం బాధపడుతూ.. క్షమాపణలు కోరుంటానని తెలిపింది. మిగతా విషయాల్లో తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని.. పలుసార్లు సరదాగా, అనాలోచితంగా ప్రవర్తించినా ఇతరులను బాధపెట్టడం మాత్రం బాధ కలిగిస్తుందని పేర్కొంది. తన లవర్ ఎఫైర్స్, బ్రేక్‌లపై స్పందిస్తూ.. అందరి జీవితంలో ఓ ప్రమాదకరమైన మాజీ ప్రేమికుడు ఉంటాడని.. అది తప్ప మిగతా బంధాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండానే ముగించినట్లు చెప్పింది.
తనను చాలామంది ఇతను ఎన్నో బాయ్‌ఫ్రెండ్ అని ప్రశ్నిస్తుంటారని.. వారికి అది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని.. తాను మాత్రం కోరుకున్న పొందడంలో విఫలమయ్యాదన్న దానికి గుర్తు మాత్రమేనని.. దాన్ని గురించి సిగ్గుపడనని, మనిషిగా కొంచెం బాధగా ఉంటుందని తెలిపింది. రిలేషన్ షిప్లో తాను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నామని.. భాగస్వాములతో విడిపోయినప్పుడు వారిని తానెప్పుడు నిందించలేదని గుర్తు చేసింది. ఈ వైఫల్యాల నుంచి ఎంతో నేర్చుకున్నానని.. వాటిని తన ఎదుగుదలకు సోపానాలుగా భావిస్తున్నట్లు చెప్పింది. ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే చివరి సారిగా సలార్-1 మూవీలో ప్రభాస్ సరసన నటించింది. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’, విజయ్ ‘జన నాయగన్, సలార్-2 చిత్రాల్లో నటిస్తున్నది.