JNTUH | కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 20 : యూనివర్సిటీలో విద్యార్థుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థి సంఘం నేతలు రాహుల్ నాయక్, దుర్గా ప్రసాద్‌లు తెలిపారు. గురువారం జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూహెచ్ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద… స్పందన బ్లాక్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండవేయడమి నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా తాగునీటిని తాగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు… వివిధ అవసరాల కోసం యూనివర్సిటీకి వచ్చే వారికోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే యూనివర్సిటీలో తాగునీటి ప్లాంట్లను రిపేరు చేయించి ప్రతి బిల్డింగ్‌లో… ప్రతి ఫ్లోర్లో తాగునీటి సదుపాయాన్ని కల్పించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు సాగర్ నాయక్ నితిన్ కుమార్, సంతోష్ కుమార్, భాను ప్రకాష్, హరినాథ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.