పైప్‌లైన్ పనులు వానకాలంలోపు పూర్తి చేయాలి
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్‌లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు
పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
మేడ్చల్ కలెక్టరేట్ మార్చి 29: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్‌లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మాయి చెరువు నుంచి నాసిక్ చెరువు వరకు పైప్‌లైన్ పనులను రూ. 7 కోట్లను మంజూరు చేశామని, నాసిక్ చెరువు నుంచి నాగారం శివారు వరకు మరో రూ.5 కోట్లను త్వరలో మంజూరు చేసి పనులను పూర్తి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు నర్సింహారెడ్డి, రమేశ్‌గౌడ్, సరిత, నాయకులు హరిగౌడ్, నరహరిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఎస్వీ నగర్‌కు చెందిన ఐ.మాదధవికి రూ.1.5లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెలే ముఠా గోపాల్, నాయకులు ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
జవహర్‌నగర్, మార్చి 29: 9వ డివిజన్ కార్పొరేటర్ శారదామనోధర్రెడ్డి ఆధ్వర్యంలో రూ. 45లక్షలతో సీసీ రోడ్డు పనులకు మేయర్ మేకల కావ్యతో కలిసి మంత్రి మల్లారెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో కార్పొరేషన్లో ఇప్పటికే రూ. 56కోట్లతో సీసీరోడ్లు, అం తర్గత డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

