sai dharam tej accident | హైదరాబాద్‌లో ఎన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయో తెలుసా?

Sai dharam tej accident |ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సిన రైడింగ్‌ను నిత్యం బిజీగా ఉండే నగర రోడ్లపై చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. గ్రేటర్ పరిధిలో 40 స్పీడ్ దాటొద్దని అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేసినా.. రోడ్డు వైశాల్యం దృష్ట్యా ఎంత వేగంతో వెళ్లాలో కూడా సూచిక బోర్టులు పెట్టినా వాటిని పట్టించుకోకుండా బడాబాబులు ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్ పై దూకుడుగా దూసుకుపోతున్నారు. వాహనదారులను పట్టించుకోకుండా అతివేగమే పరమావధిగా ఎక్స్‌లేటర్ పెంచుతున్నారు. ఫలితంగా ప్రమాదం.. తీవ్ర గాయా లు.. వెంటిలేటర్ చికిత్స.. లక్కు బాగుంటే ప్రాణాలు దక్కుతున్నాయి. లేదంటే కుంటుంబాలకు శోఖమే. నగర రోడ్లపై ఎన్నో భయానక రోడ్డు ప్రమాదాలు సాక్ష్యంగా ఉన్నప్పటికీ కొంతమంది ప్రముఖుల పిల్లలు గుణపాఠం నేర్చుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.
స్పోర్ట్స్ బైక్స్ ( Sports bikes )తో జరభద్రం..
ప్రస్తుతం స్పోర్ట్స్ బైక్స్ ( Sports bikes ) పై క్రేజ్ పెరుగుతోంది. సంపన్నుల కుటుంబాల గ్యారేజీలో పదుల సంఖ్యలో స్పోర్ట్స్ బైకులు ఉంటున్నాయి. అందులో వెయ్యి సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్‌కు శ్రీమంతుల బిడ్డలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో బీఎండబ్ల్యూఎస్1000ఆర్ఆర్, అవేంజర్, హార్ల్డెవిడ్సన్, ఆస్టానా, కేటీఎం, ట్రియాంఫ్ ట్రైడెంట్, 660 మోడల్, కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, హోండా సీబీ1000 ఆర్ఆర్, సుజుకీ జీఎస్ఎక్స్-ఆర్1000, యమహా వైజెడ్ఎఫ్, సుజుకి హాయబుసా తదితర హైఎండ్ బైక్ మోడల్స్ ఉన్నాయి. ఇందులో రకరకాల కూల్డ్ సిలిండర్స్తో పాటు స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ ఉంటాయి. విభిన్న రకాల రకాల రైడ్స్ మోడ్స్ ఉంటాయి. వర్షాలు భారీగా కురుస్తుండటం, బురద తదితర పరిస్థితులు ఎదురైనప్పుడు మోడ్ ఆన్ చేసుకుంటే అందుకు తగ్గట్టుగా వెహికిల్ అడ్జస్ట్ అయి ప్రయాణం సాఫీగా సాగుతుంది. మామూలు బైకుల టైర్ల మాదిరిగా కాకుండా ఈ స్పోర్ట్స్ బైకుల టైర్లు ఫ్లాట్‌గా ఉంటాయి. స్పోర్ట్స్ లుక్.. మంచి పికప్, మెరుగైన ఇంజిన్ వీటి ప్రత్యేకత. అందుకే వీటిని డ్రైవ్ చేయడానికి యూత్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. లక్షల రూపాయల విలువ జేసే ఈ బైకులు ఏవీ గ్రేటర్ రోడ్లపై డ్రైవింగ్‌కు అనుకూలం కావు. ఈ విషయాన్ని వదిలేసి రయ్‌మంటూ డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రేటర్లో 1756కు పైగా స్పోర్ట్స్ బైకులు.. 12 వందలకు పైగా స్పోర్ట్స్ కార్లు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
మేల్కోపోతే..
గతంలో చాలా మంది సంపన్నుల బిడ్డలు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారు. స్పోర్ట్స్ బైక్స్‌తో జర్నీ చేసి జీవితం నాశనం చేసుకున్నారు. ఆ నెత్తుటి మరకలు ఇంకా కండ్ల ముందే ఉన్నాయి. అయినా పేరేంట్స్, యువత పట్టించుకోవడం లేదు. గతంలో కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్‌రావు, బాబుమోహన్ కొడుకు పవన్, మాజీ క్రికెటర్ అజారుద్దిన్ కుమారుడు అయాజుద్దిన్ తదితరులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. శ్రీమంతుల బిడ్డలు తమకిష్టమైన బైకులను కొనుగోలు చేయడానికి ఖర్చుకు వెనకాడరు. అత్యంత బెస్ట్ క్వాలిటీ బైక్స్ కొనుగోలు చేస్తుంటారు. పిల్లల కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు ఎంతకైనా వెనకాడరు. కానీ ఇక్కడ రూట్లకు అవి సరిపడవు అనే షరతును మర్చిపోతున్నారు.
పేరేంట్స్ ఆలోచించుకోవాలి
అతివేగంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలు కోల్పోవద్దు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. నా భార్యను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఇప్పటికీ ఆ బాధ నన్ను వెంటాడుతుంది. నా కుటుంబంలో జరిగిన విషాదం మరే ఇతర కుటుంబంలో జరగకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు నచ్చజెప్పుకోవాలి. ఇక్కడ రోడ్ల మీద ఆ స్పోర్ట్స్ బైకులు పనికిరావు. అలాంటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు ఎందుకు ఇస్తున్నారనేది ఆలోచించుకోవాలి. వారికి కౌన్సెలింగ్ చేసి వారి ఆలోచన విధానం మార్చాలి. -పాండురంగ్‌నాయక్, జేటీసీ, హైదరాబాద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Babu Mohan: స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Sai Dharam Tej: తేజూకి ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్‌కి కాల్ చేసిందెవరో తెలుసా?
Harish Shankar: సాయి తేజ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాసే వారికి హరీష్ శంకర్ పంచ్
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్న ఆ ఆశ్రమ వాసులు..
Sai Dharam Tej | అతి వేగం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం : మాదాపూర్ డీసీపీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

