సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్న ఆ ఆశ్రమ వాసులు..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సాధారణ జనం కూడా కోరుకుంటున్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలేవో తాను చేసుకునే సాయి తేజ్.. ఇలా రోడ్డు ప్రమాదంలో గాయపడటం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన బాగానే ఉన్నాడు.. త్వరలోనే మళ్లీ మన ముందుకొస్తాడని వైద్యులు చెప్తున్నారు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్‌లోనూ ఇదే చెప్పారు. యాక్సిడెంట్ అయి కూడా 24 గంటలు గడవడంతో ఆయన ఆరోగ్యంలో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు వైద్యులు. స్పృహలోకి రావడమే కాదు.. చికిత్సకు కూడా స్పందిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.

సాయి ధరమ్ తేజ్‌కు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఏం లేదని.. ఎక్కడా గాయాలు కాలేదని వైద్యులు చెప్పారు. చిన్న చిన్న దెబ్బలే తగిలాయని.. త్వరలోనే అవి కూడా నయం అవుతాయని చెప్తున్నారు డాక్టర్లు. కుటుంబ సభ్యులతో పాటు సాయిని చూసిన ప్రముఖులు కూడా ఇదే చెప్తున్నారు. అయితే ఈయన ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే కాదు.. మరికొందరు వ్యక్తులు కూడా అన్నం, నిద్ర మానేసి దేవుడి ముందు కూర్చున్నారు. వాళ్లు ఎవరో కాదు.. విజయవాడలోని అమ్మ ప్రేమ ప్రేరణ ఆశ్రమం వాసులు. అక్కడ ఆ ఆశ్రమం కట్టించింది.. దానికోసం డబ్బులు ఇస్తున్నది సాయి ధరమ్ తేజ్. ఈ మధ్యే స్వయంగా విజయవాడ వెళ్లి దాన్ని ఓపెన్ చేసి వచ్చాడు సాయి తేజ్. తనకు వీలు దొరికిన ప్రతీసారి విజయవాడ వెళ్లి వాళ్లతో కాసేపు గడిపి వస్తుంటాడు. తన సొంత డబ్బులతో వాళ్లను పోషిస్తున్నాడు మెగా మేనల్లుడు.

ఛారిటీ కోసం కూడా ఇలా ఖర్చు చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. కేవలం వృద్ధాశ్రమం మాత్రమే కాదు.. తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ ను దత్తత తీసుకుని దానికి కావాల్సిన ఖర్చులు కూడా ఈయనే భరిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన దగ్గర్నుంచి అమ్మ ప్రేమ ప్రేరణ ఆశ్రమంలో ఉండే వృద్ధులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కోసం తిండి తిప్పలు మానేసి దేవుడి ముందు కూర్చున్నారు. తమకు దేవుడు ఇచ్చిన బిడ్డ సాయి తేజ్ అంటూ ఏడుస్తున్నారు. అతడికేం కాదని.. కాకూడదని.. మళ్లీ త్వరలోనే మామూలు మనిషి అయి అందరి ముందుకు వచ్చేస్తాడని వాళ్లు చెప్తున్నారు. ఆశ్రమ వాసులతో సాయి ధరమ్ తేజ్‌కు కూడా చాలా అనుబంధం ఉంది. తమ బిడ్డకు ఏం కాదని వాళ్లు దీవిస్తున్నారు. ఆ దేవుడు కచ్చితంగా సాయిని క్షేమంగా బయటికి తీసుకొస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Saidharam Tej | స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Sai Dharam Tej | అతి వేగం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం : మాదాపూర్ డీసీపీ
Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

