ఎర్రగడ్డ/బేగంపేట్/అమీర్‌పేట్, మార్చి 3: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బోరబండ చౌరస్తాలో గులాబీ శ్రేణులు నిర్వహించిన ధర్నా దద్దరిల్లింది. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు వందలాదిగా మహిళలు స్వచ్ఛందగా తరలి వచ్చి కదం తొక్కారు. బోరబండతో పాటు రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ బోరబండ బస్ టెర్మినల్ చౌరస్తాకు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్లకార్డును మోస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. చౌరస్తాలోనే కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి వంటావార్పులో గోపీనాథ్‌తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.
అనంతరం మోడీ డిష్టిబొమ్మను పార్టీ కార్యకర్తలు దగ్ధ్దం చేశారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతి కోసం పాటు పడుతుంటే.. ప్రధాని మోదీ మహిళలను కించపరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవానికి వంటగ్యాస్ ధరలను పెంచి మహిళలకు కానుకగా ఇవ్వటం సిగ్గుచేటన్నారు. ఆడపడుచుల ఆగ్రహాన్ని చవిచూడకముందే పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని గోపీనాథ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, డివిజన్ల అధ్యక్షులు కృష్ణమోహన్, సంతోష్, మన్సూర్, నేతలు విజయ్‌కుమార్, విజయసింహ, సయ్యద్సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ రాంగోపాల్‌పేట్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకురాలు అత్తెల్లి అరుణగౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్డులోని సిటిలైట్ చౌరస్తాలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర దేశంలో సామాన్య మహిళలను మరింత కుంగదీసిందని అమీర్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, సంతోష్ మణికుమార్‌లు పేర్కొన్నారు. అమీర్‌పేట్ సత్యం థియేటర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్దఎత్తున నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురిందర్‌సింగ్, లతా ముదిరాజ్, అశోక్‌యాదవ్, కూతురు నర్సింహ, ఉమానాథ్‌గౌడ్, కరుణాకర్‌రెడ్డి, హరిసింగ్, గొలుసుల సత్యనారాయణ, సచిన్ రాతోడ్ తదితరులు పాల్గొన్నారు.
దశల వారీగా గ్యాస్ ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభు త్వం అధికారంలో ఉండే అర్హత లేదని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మహేశ్వరి డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ బేగంపేట్ డివిజన్లోని రసూల్‌పుర చౌరస్తా వద్ద బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. సనత్‌నగర్ బస్ టర్మినల్లో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంతోష్ సరఫ్, సురేష్‌గౌడ్, రాజేష్ ముదిరాజ్, ఖలీల్ బేగ్, కరుణాకర్‌రెడ్డి, బాలు, వసీం, షఫీ, జమీర్బేగ్, పుష్పలత, రుక్మిణిరెడ్డి, రేణుక, వసంత, కావేరి పాల్గొన్నారు.