కైకిలి చేసుకుని బతికెటోళ్లం.. మాపైనే మీ ప్రతాపమా..? రేకులను కూల్చి స్లాబు వేసుకుందామనుకుంటే అక్రమమంటూ రెవెన్యూ అధికారులు కూల్చడంతో మా జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోడికి అండగా నిలుస్తుంది అనుకుంటే.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తుంది. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ అధికారులు ఇలా బుల్డోజర్తో ఇళ్లను కూల్చేయడంతో బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
– జవహర్నగర్, అక్టోబర్ 14