Government Schools | హైదరాబాద్‌లో సర్కారీ స్కూళ్లకు ఫుల్ డిమాండ్.. అడ్మిషన్ల కోసం రాజకీయ నాయకులతో రికమండేషన్లు
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని వివిధ స్కూళ్లకు క్యూ కడుతున్నారు.
Government Schools | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్నారు. హైదరాబాద్ జిల్లాలోని వివిధ స్కూళ్లకు క్యూ కడుతున్నారు. బోరబండలోని నాట్కో పాఠశాల, రాజ్‌భవన్ స్కూళ్లు ఇందు కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బోరబండ నాట్కో ప్రభుత్వ పాఠశాలలో 1,100 మంది పరిమితికి, 1,850కి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇంకా ప్రవేశాల కోసం నిత్యం తల్లిదండ్రుల నుంచి హెచ్ఎంకు ఒత్తిడి పెరుగుతున్నది. అడ్మిషన్ కోసం పలువురు రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయిస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఇక్కడ అడ్మిషన్లు జోరుగా జరుగుతున్నాయి.
బోరబండ స్కూల్లో 40 మంది టీచర్లు
బోరబండ నాట్కో ప్రభుత్వ పాఠశాలలో 6-10 పదో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తున్నారు. దాదాపు 40 మంది టీచర్లు పని చేస్తున్నారు. నేరుగా ఇంగ్లి ష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్‌తో డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లు ఇక్కడ బోధిస్తున్నారు.
ఆరో తరగతిలో అత్యధిక అడ్మిషన్లు
బోరబండ నాట్కో స్కూల్లో తరగతి గదులు నిండి కారిడార్లలో కూడా విద్యార్థులు కూర్చొని పాఠాలు వింటున్నారు. టీచర్ల సంఖ్యకు అనుగుణంగా ఆ స్కూల్లో 1,100 వరకు అడ్మిషన్లకు అవకాశం ఉంది. కానీ 2023-24లో గరిష్ఠంగా 1,850 మందికి ప్రవేశాలు కల్పిస్తూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా 6వ తరగతిలో 375 మంది అత్యధికంగా ప్రవేశాలు పొందినట్టు హెచ్ఎం యాదగిరి వెల్లడించారు. ఇదే స్కూల్ నుంచి 274 మంది విద్యార్థులు నిరు డు పదో తరగతి పరీక్షకు హాజరవగా, 80% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో ఫలితాలలో టాప్ గ్రేడ్‌లో 9.8 సాధించిన వా రున్నారు. 25 మంది 9.0 గ్రేడ్, ఆపైన ఉత్తీర్ణత సాధించారు. రాజ్‌భవన్ స్కూల్లో దాదాపు 750 వరకు అడ్మిషన్లకు అవకాశం ఉండగా, అన్ని సీట్లు భర్తీ అయినట్టు యాజమాన్యం తెలిపింది. జిల్లాలో ఇంకా 20 స్కూళ్ల వరకు దాదాపు 80 నుంచి 90 శాతం వరకు అడ్మిషన్లు జరిగినట్టు హైదరాబాద్ డీఈవో ఆర్ రోహిణి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

