Deer | మెహిదిపట్నం, ఫిబ్రవరి 27: జూపార్కులు, అడవుల్లో ఉండే జింక.. జనావాసాల మధ్య ప్రత్యక్షమైంది. అదేదో ఏదో గ్రామీణ ప్రాంతంలో కాదు.. నిత్యం ప్రజలు, ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో.
ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఓ జింక ప్రత్యక్షమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని, స్థానికుల సహాయంతో జింకను పట్టుకున్నారు. అనంతరం జింకను పోలీసులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. గుడిమల్కాపూర్‌లో ప్రత్యక్షమైన జింకను నెహ్రూ జూపార్కులో వదిలేశారు. అయితే జింక ఎక్కడ్నుంచి వచ్చిందనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.