హైదరాబాద్ : బేగంపేట ఫ్లైఓవర్ పై(Begumpet flyover) ఓ డీసీఎం(DCM) బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన డీసీఎం బేగంపేట ఫ్లైఓవర్ పైకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం ముందు చక్రాలు విరిగిపోయాయి. బేగంపేట నుంచి పంజగుట్ట వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
RSP | ఆకాశానికి ఎగిసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ధ్వజం
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్