పంపిణీకి సిద్ధం
సంతోషంలో దళితులు
కందుకూరు, ఏప్రిల్ 2: దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈనెల 31 వరకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి రూ.10లక్షలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మండలంలో ప్రక్రియను పూర్తి చేశారు. నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో 50మంది, మహేశ్వరం మండలంలో 50మంది.. మొత్తం 100మందిని ఎంపిక చేశారు. మండల పరిధిలోని లేమూరులో 8 మంది, తిమ్మాపూరులో 8 మంది, రాచులూరులో ఆరుగురు, మాదాపూరులో ఆరుగురు, మీర్ఖాన్పేట్ గ్రామంలో నేదునూరులో ఏడుగురు, బాచుపల్లి, నలుగురు, కొత్తగూడ నలుగురిని ఎంపికచేశారు. మినీ డైరీకి 13మంది, వ్యాపారాల నిమిత్తం 9 మంది. ట్రాక్టర్లు, కార్ల యూనిట్ల కోసం 26 మంది, పౌల్ట్రీల కోసం ఇద్దరు దరఖాస్తులు చేసుకోగా, వాటిని పరీలించి ఇక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేసినట్లు ఇన్చార్జి ఎంపీడీఓ నర్సింలు తెలిపారు. దీంతో దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.