Cycling Track | హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి, ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి రెండు వైపులా మొత్తం 23 కి.మీ మేర సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
అయితే ఈ సైకిల్ ట్రాక్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు ప్రాంతంలో నానక్‌రాంగూడ టోల్గేట్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న సోలార్ రూప్‌టాప్ సైకిల్ ట్రాక్ స్తంభాలను హెచ్ఆర్డీసీఎల్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. హెచ్ఆర్డీసీఎల్ అధికారులు మొత్తం 14 స్తంభాలను తొలగించి 60 సోలార్ ప్లేట్లను తీసివేశారు.
తాజాగా మరో నిర్లక్ష్యం వెలుగు చూసింది. వట్టినాగులపల్లి జంక్షన్ వద్ద సైకిల్ ట్రాక్‌కు పగుళ్లు వచ్చాయి. ఈ పగుళ్లకు సంబంధించిన ఫొటోను సైకిల్ మేయర్ అఫ్ హైదరాబాద్‌కు సంబంధించిన నిర్వాహకులు ఎక్స్‌లో పోస్టు చేసి.. హెచ్ఎండీఏకు, తెలంగాణ సీఎంవోతో పాటు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. సైకిల్ ట్రాక్ పగుళ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. తక్షణమే స్పందించిన అధికారులు.. ఆ పగుళ్లకు మరమ్మతులు చేపట్టి ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. పగుళ్లను పూడ్చినందుకు అధికారులకు సైకిల్ మేయర్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Request kind attention from @HMDA_Gov @md_hgcl to fix our world famous #Hyderabad pride #HyderabadCyclingTrack
Vatinagulapally junction@CommissionrGHMC @ZC_SLP @TelanganaCMO @gadwalvijayainc @revanth_anumula @prudhviramk7 @Kmv_Spaces
Thanks @swaroop @HydcyclingRev… pic.twitter.com/enNy1HHxia
— Bicycle Mayor of Hyderabad (@sselvan) January 15, 2025
ఇవి కూడా చదవండి..
Chinese Manja | చైనీస్ మాంజాపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
Murder | నార్సింగి జంట హత్యల కేసులో ట్విస్ట్.. రెండో ప్రియుడే అంతమొందించాడు..!
KTR | కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై కాంగ్రెస్ నేతల అబద్ధపు ప్రచారం.. మండిపడ్డ బీఆర్ఎస్