Chinese Manja | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా లభ్యమవుతున్న చైనీస్ మాంజాపై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనీస్ మాంజాను స్థానికంగా తయారు చేయడం వల్లే పెద్ద మొత్తంలో లభ్యమవుతుందని తెలిపారు. ఈ -కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వస్తుందన్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఈ-కామర్స్ గోదాములపై కూడా సోదాలు చేస్తామని సీపీ తెలిపారు. గోదాముల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి.. కీలక సూచలే జారీ చేస్తామన్నారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే సాధ్యమవుతుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
లంగర్‌హౌజ్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ మెడకు చైనా మాంజా తగిలి తీవ్ర గాయమైంది. నిన్న తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నారాయణగూడ ఫ్లై ఓవర్ మీద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న కానిస్టేబుల్‌ను గమనించిన వాహనదారులు.. తక్షణమే ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Murder | నార్సింగి జంట హత్యల కేసులో ట్విస్ట్.. రెండో ప్రియుడే అంతమొందించాడు..!
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ తేదీలు ఖరారు.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు
Brahmanandam | సంక్రాంతి వేళ.. కరీంనగర్ ఆలయాలను సందర్శించిన బ్రహ్మానందం..