Cyber Crime | సిటీబ్యూరో: ‘మీ ఫోన్ నంబర్‌తో ఢిల్లీకి డ్రగ్ సరఫరా అవుతున్నాయి.. మిమ్మల్ని విచారించాలి.. అందుకు ఆర్బీఐ అకౌంట్‌కు మీ ఖాతాలోని డబ్బులన్నీ బదిలీ చేయాలి’ అంటూ 80 ఏండ్ల వృద్ధురాలిని బెదిరించిన సైబర్‌నేరగాళ్లు..లక్షలు కాజేశారు. పోలీస్ కమిషనర్నంటూ.. బాధితురాలికి ఫోన్ చేసిన ఆగంతకులు.. ‘ఢిల్లీకి సరఫరా అవుతున్న పార్సిల్‌పై మీ ఫోన్ నంబర్ ఉంది.. విచారణ అనంతరం దోషులను గుర్తుపడుతాం’. అంటూ నమ్మించి.. రూ. 22 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.
దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో మీకు సంబంధాలున్నాయి.. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది’..అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగం చేసే 60 ఏండ్ల వ్యక్తిని భయాందోళనకు గురిచేసి..దోచేశారు సైబర్‌నేరగాళ్లు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తామం’టూ.. బెదిరించారు. తన కొడుకు పెండ్లి కోసం దాచిన డబ్బులను ఫ్రీజ్ చేయవద్దంటూ..బాధితుడు వేడుకున్నాడు. అయితే మీ డబ్బును తీసుకోం.. ఎస్ఎస్ఏ లోకి బదిలీ చేస్తామని, స్కూట్రీని తరువాత మీకు ఆ డబ్బు వాడుకునేందుకు ఆర్థిక శాఖ అవకాశమిస్తుందంటూ నమ్మించి..రూ. 21 లక్షలు అపహరించారు.