సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ మీరు రిటైర్డు ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 90 లక్షలు టోకరా వేశారు. నాగోల్‌కు చెందిన బాధితుడి ఫోన్ నంబర్‌ను ‘ఏ9 వెల్త్ అలయన్స్ ట్రైనింగ్ టీమ్’ అనే వాట్సాప్ గ్రూప్‌నకు యాడ్ చేశారు. యాప్ ‘టోటెమ్-పీఎం’ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుందని దానిని డౌన్లోడ్ చేసుకొని యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని సూచించారు. మేం చెప్పే టిప్స్‌ను తెలుసుకొని భారీ లాభాలు ఆర్జించండంటూ సూచనలు చేశారు. నమ్మిన బాధితుడు దఫ దఫాలుగా డబ్బులు చెల్లించాడు.
ఐపీఓలు కేటాయించడం, ఆ తరువాత విక్రయించడంతో స్క్రీన్‌పై అధిక లాభాలు కన్పిస్తున్నాయి. ఇలా రూ. 90 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అయితే విత్ డ్రా ఆప్షన్‌ను సైబర్‌నేరగాళ్లు తొలగించారు. రూ. 64 లక్షల విలువైన లక్ష షేర్లు కేటాయించామని ఆ డబ్బు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తన వ్యాలెట్‌లో నుంచి డబ్బు తీసుకొని చెల్లిస్తానంటూ కోరినా, అందుకు నేరగాళ్లు నిరాకరించారు. ఇదంతా మోసమని తెలుసుకొని బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.