హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. గురువారం వేకువజామున ఉదయం 3 గంటల ప్రాంతంలో శాలిబండలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. గత రాత్రి ఆందోళనకారులు మళ్లీ పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. రాత్రంతా రోడ్డు మీదకు రాకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన నిర్వహించిన సుమారు మందికిపైగా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ బలగాలు పాతబస్తీలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. పోలీసులు అప్రమత్తమైనప్పటికీ కొందరు నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. శాలిబండ, సైదాబాద్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేపట్టారు.
రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ తీసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి వారిని చెదరగొట్టారు. మొగల్పురాలో పలువురు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్మినార్, శాలిబండ వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి, రోడ్లను మూసివేశారు. ఇదిలా ఉండగా.. ఎంపీ అసద్దుద్దీన్, కార్పొరేటర్ల విజప్తి మేరకు అదుపులోకి తీసుకున్న 127 మందిని పోలీసులు విడుదల చేశారు. అర్ధరాత్రి 3గంటల సమయంలో యువకులను కంచన్‌బాగ్ పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. ఇవాళ కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి.
Telangana | Security at Charminar in Hyderabad in wake of massive protest here on August 23, against the suspended BJP leader Raja Singh’s alleged remarks on Prophet Muhammad.
Visuals from the spot this morning. pic.twitter.com/4FebeeFNIO
— ANI (@ANI) August 25, 2022