HYDRAA | హైదరాబాద్ : చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు నమోదు చేశారు.
నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్స్, బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్‌పై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ తెలిపారు.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | గగన్‌పహాడ్‌లో హైడ్రా.. అప్ప చెరువులో నిర్మాణాల కూల్చివేత
Hyderabad | హైదరాబాద్ పబ్బులపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
Jurala Project | జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద.. 45 గేట్లు ఎత్తివేత