హైదరాబాద్ : రెండు రోజుల క్రితం మాదాపూర్లోని(Madhapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటేష్ (35), వెంకటేష్ భార్య లక్ష్మి (28), వెంకటేష్ తమ్ముడు నరేష్ (28) మీద విధులను అడ్డుకున్నారని పోలీసులు క్రిమినల్ కేసులు(Criminal cases )నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైడ్రా కూల్చివేతలపై పేదలు (Hydra victims)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమను అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Committed suicide) ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు బాధితులపైనే కేసులు పెడుతున్న తీరుపై అన్ని విపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కండ్ల ముందే కూల్చేయడమే కాకుండా తిరిగి బాధితులపై కేసులు పెడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.